Rajasthan govt: పోలీసు శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్.. రాజస్థాన్ కేబినెట్ ఆమోదం

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు రాజస్థాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Update: 2024-09-04 17:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు రాజస్థాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం భజన్ లాల్ శర్మ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా, మంత్రి జోగరామ్ పటేల్ లు వివరాలు వెల్లడించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1989ని సవరించనున్నట్టు తెలిపారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సుస్థిర ఇంధన ఉత్పత్తిని పెంపొందించేందుకు గాను సౌరశక్తి ప్రాజెక్టులకు భూములను కేటాయించినట్టు చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రైతులు, సాధారణ ప్రజలకు తగినంత విద్యుత్ అందేలా చూడటమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. అలాగే రాష్ట్ర ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


Similar News