Rajasthan: బోరు బావిలో పడిపోయిన చిన్నారి.. పది రోజుల తర్వాత వెలికితీత

పది రోజుల క్రితం బోరు బావిలో పడిపోయిన చిన్నారిని అధికారులు వెలికితీశారు.

Update: 2025-01-01 14:20 GMT

దిశ, వెబ్ డెస్క్: పది రోజుల క్రితం బోరు బావిలో పడిపోయిన చిన్నారిని అధికారులు వెలికితీశారు. గత నెల 23న రాజస్థాన్(Rajsthan) లోని కోఠ్‌పుత్లీ(Kotputhly) లో చేతన అనే మూడేళ్ల బాలిక ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు.. రెస్క్యూ టీం సహాయంతో బాలికను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాలిక పడిపోయిన బోరు బావి(Borewell) పక్కనే మరో సొరంగం తవ్వి పది రోజుల తర్వాత బుధవారం బయటకు తీశారు. వెలికి తీసిన సమయంలో బాలిక శరీరంలో ఎలాంటి కదలిక లేదని గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చేతనను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ఎన్‌డీఆర్ఎఫ్ చీఫ్ యోగేష్ మీనా(NDRF Chief Yogesh Meena) మాట్లాడుతూ.. బాలికను కాపాడేందుకు రెస్క్యూ టీం పది రోజుల పాటు తీవ్రంగా శ్రమించిందని, ఈ ఆపరేషన్ లో రాతి కొండలు, వర్షం లాంటి సవాళ్లను టీం ఎదుర్కున్నట్లు తెలిపారు. తమ టీం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు.

Tags:    

Similar News