Indian Railways: అన్ని రకాల టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల సబ్సిడీ

భారతీయ రైల్వేలు(Indian Railways) అన్ని వర్గాల ప్రయాణికులకు ఏటా రూ. 56,993 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) తెలిపారు.

Update: 2024-12-04 08:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ రైల్వేలు(Indian Railways) అన్ని వర్గాల ప్రయాణికులకు ఏటా రూ. 56,993 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) తెలిపారు. ప్రతి టిక్కెట్‌పై 46 శాతం రాయితీ ఉంటుందని రైల్వే వెలడించారు. ఈ రాయితీని అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. లోక్ సభలో(Lok Sabha) పలు ప్రశ్నోత్తరాలలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.వంద రైల్వే టికెట్ లో.. రూ.46 కేంద్రమే భరిస్తోందన్నారు. రాపిడ్ ట్రైన్ సర్వీస్ పై ఆయన మాట్లాడారు. ఆ సర్వీసులను ఇప్పటికే నమో భారత్ ర్యాపిడ్ రైల్ సర్వీసులను ప్రారంభించామన్నారు. భుజ్- అహ్మదాబాద్ మధ్య ఇప్పటికే అలాంటి సేవలు ప్రారంభించామన్నారు. నమో భారత్ ర్యాపిడ్ రైల్ భుజ్- అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే తీసుకెళ్తున్నానని అన్నారు. దీనిద్వారా ఇంటర్‌సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. ఆ మార్గంలో అనేక స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయన్నారు.

Tags:    

Similar News