ప్రయాణికులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి టికెట్ బదిలీ
రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరిలో
దిశ, తెలంగాణ బ్యూరో: రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం, డబ్బు కూడా వృధా అవుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి లేదు.. రిజర్వేషన్‌ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది రైల్వే శాఖ. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ రిజర్వేషన్ టిక్కెట్‌ను బదిలీ చేయొచ్చు. ప్రయాణానికి 24 గంటల ముందు రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా రిజర్వేషన్ బదిలీ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ బదిలీ ఇలా ..
ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ ట్రాన్సఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలా చేస్తేనే మరో ప్రయాణికుడి పేరు మీద టికెట్ బదిలీ అవుతుంది. ఎంప్లాయీస్ అయితే పండుగలు, పెళ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో డిపార్చర్‌కు 48 గంటలకు ముందు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎన్సీసీ క్యాడెట్లకు కూడా వర్తిస్తుంది.
రిజర్వేషన్ టిక్కెట్ బదిలీ ప్రక్రియ దశలవారీగా ఉంటుంది. ముందుగా టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత సమీప రైల్వే స్టేషన్‌ని సందర్శించి రిజర్వేషన్ కౌంటర్‌కి వెళ్లి టిక్కెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటి ఐడితో పాటు మీ ఐడి కాపీ తప్పనిసరి జత చేయాలి . అన్ని డాక్యుమెంట్లతో రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ టికెట్ బదిలీ అవుతుంది