మాపై సోదాలకు ఆ ఎన్నికలే కారణం: Arvind Kejriwal
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖులు, రాజకీయ నేతల నివాసాలు, కార్యాల్లో సోదాలు ముమ్మరం చేశాయి. ఇందులో..
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖులు, రాజకీయ నేతల నివాసాలు, కార్యాల్లో సోదాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నివాసాల్లో సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సభలో మాట్లాడుతూ మోదీ, బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ నేతలపై ఇటీవల జరిగిన దర్యాప్తు సంస్థల దాడులు గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల కారణంగానే అని అన్నారు.
అంతేకాకుండా ఏ ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా డిఫెక్ట్ కాలేదని నిరూపించేందుకు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకొస్తానని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. 'బీజేపీ కంచుకోట గుజరాత్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. బీజేపీ కోట కూలిపోతుంది. రానున్న ఎన్నికల కారణంగానే మనపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ శక్తులు ఇప్పటికే మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు పడగొట్టాయి' అని కేజ్రీవాల్ అసెంబ్లీలో అన్నారు.
ఇవి కూడా చదవండి : ప్రభుత్వాలను కూల్చే సీరియల్ కిల్లర్ బీజేపీ : Arvind Kejriwal