రాహుల్ గాంధీ హెలికాప్టర్ చెకింగ్..!
లోక్‌సభ ఎన్నికలు వేళ అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు వేళ అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో తనిఖీలు చేపట్టారు ఎన్నికల అధికారులు. తమిళనాడులోని నీలగిరిలో తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక.. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు
నీలగిరి లోక్ సభ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి ఎ.రాజాకు మద్దతుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హెలికాప్టర్ నీలగిరిలో ల్యాండ్ అవ్వగానే ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేపట్టారు. దాదాపు 10 నిమిషాల పాటు తనిఖీలు నిర్వహించారు. రాహుల్ దగ్గర ఎలాంటి విలువైన వస్తువులు, నగదు దొరకలేదని తెలిపారు ఎన్నికల అధికారులు.
నీలగిరిలో ప్రచారం ముగిశాక.. వయనాడ్ కు వెళ్లారు రాహుల్ గాంధీ. అక్కడ బహిరంగ సభతో సహా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వయనాడ్ నుంచే రాహుల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. వయనాడ్ నుంచి రెండోసారి పోటీలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.