రాహుల్ చిన్నవాడు.. 2029, 2034 ఎన్నికలకు ఎదురుచూడాలి: హర్దీప్ సింగ్ పూరి

ఎగ్జిట్ పోల్స్‌ అన్ని కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తాయని స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే 2029, 2034 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

Update: 2024-06-02 12:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎగ్జిట్ పోల్స్‌ అన్ని కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తాయని స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే 2029, 2034 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఒక మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అంటున్నారు, వారికి మరింత ఎక్కువ భ్రమలు, ఆత్మవిశ్వాసంతో మునిగిపోవడానికి మరో 48 గంటలు ఇవ్వండి, ఆపై ఆయన 4వ తేదీన అన్ని వాస్తవాలను తెలుసుకుంటాడు, ఫలితాలను చూడగానే ఆయన ఆశలు ఆవిరైపోతాయని హర్దీప్ సింగ్ అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీయే గెలుపును సూచిస్తున్నాయి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పంజాబ్‌లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. 2014, 2019 సంవత్సరాల అనుభవాన్ని ఉటంకిస్తూ, బీజేపీ 340 సీట్లకు పైగా సాధిస్తుందని విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ, అతను ఇంకా చిన్నవాడు, 2029, 2034 ఎన్నికల కోసం ఎదురు చూడాలని అన్నారు.

ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తాయని పేర్కొన్నాయి. 1951-52 తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం అయింది. అన్ని పోల్స్‌లో కూడా ఎన్డీయే కూటమికి దాదాపు 350 సీట్లకు పైగా వస్తాయని పేర్కొన్నాయి.


Similar News