MK Stalin : తమిళ మత్స్యకారులను విడిచి పెట్టాలని శ్రీలంకకు స్టాలిన్ రిక్వెస్ట్

తమిళ మత్స్యకారుల(Tamil Fishermen)ను విడిచిపెట్టాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) శ్రీలంకను రిక్వెస్ట్ చేశారు.

Update: 2024-10-28 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళ మత్స్యకారుల(Tamil Fishermen)ను విడిచిపెట్టాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) శ్రీలంకను రిక్వెస్ట్ చేశారు. రామేశ్వరానికి చెందిన 16 మంది మత్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని విడిపించడానికి దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌(Jai Shanaker)ను ఇప్పటికే ఎంకె స్టాలిన్ అభ్యర్థించారు. ఈ ఏడాది ఇంతవరకు ఇలాంటి సంఘటనలు 30 వరకు జరిగాయని, మొత్తం 140 మంది మత్సకారులను అరెస్ట్ చేశారని, 200 బోట్లు ప్రస్తుతం శ్రీలంక నేవీ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు.

కాగా ఇటీవల రామేశ్వరం(Rameshwaram) నుంచి బయలు దేరిన 400 మందిలో 16 మంది మత్స్యకారులు అంతర్జాతీయ సాగర జలాలను దాటుతున్నారన్న కారణంతో అరెస్టు చేశారు. వీరి బోట్లను స్వాధీనం చేసుకుని మయిలట్టి ఫిషింగ్ పోర్టుకు తరలించారు. అక్కడ జాఫ్నా(Jafna) ఫిషింగ్ డిపార్టుమెంట్‌కు ఈ బోట్లు అప్పగించారు. ఈ అరెస్టులు, బోట్ల స్వాధీనం సంఘటనలతో తమిళనాడు కోస్తా సమాజ భద్రతకు, జీవనానికి ముప్పు ఏర్పడుతోందని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని విడిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు.

Tags:    

Similar News