Rahul gandhi: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మోడీ స్పష్టతివ్వాలి.. రాహుల్ గాంధీ

ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనౌ రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి.

Update: 2024-09-25 15:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనౌ రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కంగనా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ఇండియా కూటమి అనుమతించబోదని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘వ్యవసాయ చట్టాలను మీరు మళ్లీ పునరుద్దరిస్తారా? ఒక వేళ అదే ఆలోచనలో ప్రభుత్వం ఉంటే ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని మర్చి పోకండి. రద్దు చేసిన వాటిని తిరిగి తీసుకురావాలని చూస్తే ఇండియా కూటమి వాటిని అడ్డుకుంటుంది’ అని తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని నిర్ణయించేది బీజేపీ ఎంపీనా? లేక ప్రధాని మోడీనా అని ప్రశ్నించారు. కాగా, గతంలో రద్దు చేసిన మూడు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కంగనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు విమర్శలు గుప్పించగా ఆమె క్షమాపణలు చెప్పారు. 


Similar News