లేటరల్ ఎంట్రీ నియామకాలపై రాహుల్ విమర్శలు

ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో లేటరల్ ఎంట్రీ పద్దతిలో నియమకాలను లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

Update: 2024-08-18 13:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో లేటరల్ ఎంట్రీ పద్దతిలో నియమకాలను లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూపీఎస్సీకి బదులుగా ఇతర మార్గాల్లో నియామకాల్లో చేపట్టడం రాజ్యాంగపై దాడి లాంటిదే అని మండిపడ్డారు. లేటరల్ ఎంట్రీ ద్వారా 45 మంది జాయింట్ సెక్రేటరీలను, డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ అప్లికేషన్స్ ఇవ్వగా.. రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. 'కేంద్ర శాఖల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు చేపడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కుంటున్నారు. ఉన్నత పదవుల్లో అణగారిన వర్గాలకు ఇప్పటికీ సరైన అవకాశాలు దక్కడం లేదు. లేటరల్ ఎంట్రీ ద్వారా వారిని ఆ పదవులకు దూరం చేస్తున్నారు. ప్రతిభావంతులైన యువత హక్కులను కాజేస్తున్నారు. కీలకమైన పదవుల్లో చేరడం ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఏం చేస్తారు అనేదానికి పెద్ద ఉదాహరణ సెబీ' అన్నారు. ఈ విధమైన భర్తీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ శాఖల్లో సెక్రేటరీలుగా, జాయింట్ సెక్రెటరీలుగా, డైరెక్టర్లుగా ప్రైవేట్ రంగంలోని వారిని నియమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఈ పోస్టులకు యూపీఎస్సీ అధికారులను, గ్రూప్ ఏ అధికారులను నియమిస్తుంటారు.       

Tags:    

Similar News