ఓబీసీ కమ్యూనిటీపై దాడిని రాహుల్ తన హక్కుగా భావించారు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఓబీసీ కమ్యూనిటీపై దాడిని రాహుల్ గాంధీ తన హక్కుగా భావించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

Update: 2023-03-28 04:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓబీసీ కమ్యూనిటీపై దాడిని రాహుల్ గాంధీ తన హక్కుగా భావించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినాయకుడికి ఎంత ద్వేషం ఉందనే విషయం రాహుల్ బ్రిటన్ పర్యటనలో స్సష్టమైందని ఆమె నిప్పులుచెరిగారు.

రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై మాటలతో దాడి చేస్తున్నప్పుడు, మొత్తం ఓబీసీ కమ్యూనిటీపై దాడి చేయడం తన హక్కుగా భావించారని అన్నారు. 'మే 4, 2019న, ప్రధాని మోదీ శక్తి తన ఇమేజ్ అని, ఆ ఇమేజ్‌కి భంగం వాటిల్లేలా నిరంతరం కృషి చేస్తానని రాహుల్ గాంధీ అన్నారని స్మృతి ఇరానీ తెలిపారు. తన రాజకీయాల్లో చెందిన నిరాశతోనే రాహుల్ గాంధీ తన బ్రిటన్ పర్యటనలో నరేంద్ర మోడీ పట్ల విషం వెల్లగక్కారని ఆమె ఆరోపించారు.

ఒకానోక దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కూడా కాంగ్రెస్ పార్టీ మాటల దాడికి దిగిందని తెలిపారు. అప్పట్లో రాహుల్ గాంధీ ఒక దళిత నాయకుడిని తన చెప్పులు తీసుకెళ్లమని చెప్పే మీడియాలో చెక్కర్లు కొట్టిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ పేరు, ప్రతిష్టను విచ్ఛిన్నం చేసే కుట్రలు, రాహుల్ కల ఎప్పటికీ నెరవేరదని, ఎందుకంటే నరేంద్ర మోదీ శక్తి భారత ప్రజలేనని స్మృతి ఇరాని అన్నారు. 

Tags:    

Similar News