దేశంలోనే తొలి శానిటరీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌..

Update: 2023-07-16 17:09 GMT

పుణె : దేశంలోనే మొట్టమొదటి శానిటరీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ వచ్చే నెల మొదటివారంలో మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభం కానుంది. వాడి పారేసిన నాప్‌కిన్‌లు, డైపర్‌ల వంటివి శానిటరీ వ్యర్థాల కేటగిరీలోకి వస్తాయి. రోజూ 4.5 టన్నుల శానిటరీ వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని పుణె మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. ఇటలీ నుంచి తెప్పించిన శానిటరీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను రోచెమ్ సెపరేషన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హడప్సర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు.

పుణె మున్సిపాలిటీ కేటాయించిన స్థలంలో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్ జీ) కంపెనీ ఉచితంగా శానిటరీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఒప్పందం ప్రకారం ఈ ప్లాంట్‌ను మూడేళ్లపాటు రోచెమ్ సెపరేషన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా ప్రైవేట్ సంస్థ నిర్వహణ బాధ్యతలను కొనసాగించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. ఈ ప్లాంట్‌కు నీరు, విద్యుత్తును పుణె మున్సిపాలిటీ ఉచితంగా అందిస్తుంది.


Similar News