ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు నిరసన సెగ

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది.

Update: 2024-05-20 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనాకు అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం లాహౌల్-స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లగా అక్కడి ప్రజలు గో బ్యాక్ కంగనా అంటూ నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆమె కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నిరసనకు ఆ ట్వీటే కారణమా?:

అయితే లాహౌల్-స్పితిలో 70 శాతం మంది బౌద్ధమతం అనుసరించే వారు జీవిస్తున్నారు. గతంలో కంగనా రనౌత్ టిబెటియన్ మత గురువైన దలైలామా, యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ పక్కన ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. ఇందులో దలైలామా వివాదాస్పద రీతిలో ఎడిట్ చేయబడి ఉండటంతో కాంట్రవర్సీయల్ అయింది. ఈ నేపథ్యంలో అనంతరం కంగనా క్షమాపణలు కూడా చెప్పింది. ఇటీవల మెక్ లియోడ్ గంజ్ కు వెళ్లిన కంగనా దలైలామాను కలుసుకుంది. తాజాగా నిరసనలకు దలైలామా విషయంలో కంగనా గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్ కారణం అనే టాక్ వినిపిస్తోంది.

అయితే నిరసనలపై ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ స్పందిస్తూ కంగనా కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడులకు కాంగ్రెస్ దే బాధ్యత అని.. కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ ఘటన దురదృష్టకరం అని పక్కా ప్లాన్ ప్రకారమే ఇది చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Click Here For Twitter Post..

Tags:    

Similar News