Supreme Court: బాల్యవివాహాల నిర్మాలన చట్టాల అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాల్య వివాహాల నిర్మూల‌న చ‌ట్టాల అమ‌లుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీల‌క వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-10-18 10:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బాల్య వివాహాల నిర్మూల‌న చ‌ట్టాల అమ‌లుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీల‌క వ్యాఖ్యలు చేసింది. ఆ చ‌ట్టాల ద్వారా బాధితుల‌ను శిక్షించినా.. ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌ట్లేద‌ని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే క‌మ్యూనిటీ ఆధారంగా ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది. బాల్య వివాహాల చ‌ట్టాల అమ‌లు తీరును ప్ర‌శ్నిస్తూ ఓ ఎన్జీవో వేసిన పిల్‌పై సుప్రీంలో విచార‌ణ జ‌రిగింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో వాద‌న‌లు వింది. బాల్య వివాహం జ‌రిపిన‌ కేసుల్లో వ్య‌క్తుల‌ను శిక్షించినా.. పెద్ద‌గా ఏమీ మార్పు జ‌ర‌గ‌డం లేద‌ని కోర్టు తెలిపింది. చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌డం అంటే శిక్షించ‌డ‌మే కాదు అని కోర్టు పేర్కొంది. బాల్యవివాహాల నిర్మాలన చ‌ట్టం అమ‌లు విష‌యంలో వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్య స‌హ‌కారం అవ‌స‌రం అని కోర్టు తెలిపింది. చ‌ట్టాల అమ‌లుతో ల‌క్ష్యాలు సాధించేందుకు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కోర్టు సూచించింది. తాము సూచించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌కు ఆదేశాలు ఇచ్చారు.


Similar News