Priyanka Gandhi : జర్నలిస్టు హత్య.. ఖండించిన ప్రియాంక గాంధీ
ఛత్తీస్‌గఢ్(Chatthisghar) లో జర్నలిస్ట్ హత్య (Journalist Murder)కు గురవడంపై ఎంపీ ప్రియాంక గాంధీ(MP Priyanka Gandhi) స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chatthisghar) లో జర్నలిస్ట్ హత్య (Journalist Murder)కు గురవడంపై ఎంపీ ప్రియాంక గాంధీ(MP Priyanka Gandhi) స్పందించారు. బీజాపూర్ కు చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్(Mukhesh Chandrakar) హత్యకు గురికావడం తనను షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపిన ప్రియాంక.. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరింతమందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జర్నలిస్టు హత్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ(Deputy CM Vijay Sharma) ఓ ప్రకటన జారీ చేశారు.