కెనడాలోని హిందూ దేవాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ
సోమవారం కెనడాలోని(Canada) హిందూ భక్తులపై (Hindu Devotees) ఖలిస్థానీ గ్రూప్‌కు చెందిన పలువురు సోమవారం దాడికి పాల్పడ్డారు.
దిశ, వెబ్ డెస్క్: సోమవారం కెనడాలోని(Canada) హిందూ భక్తులపై (Hindu Devotees) ఖలిస్థానీ గ్రూప్‌కు చెందిన పలువురు సోమవారం దాడికి పాల్పడ్డారు. బ్రాంప్టన్ లో ఉన్న హిందూ సభా (Hindu Sabha Temple)మందిర్‌లోని భక్తులపై ఖలిస్థానీలు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని, ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని తెలిపారు.
కాగా కెనడాలో హిందూ దేవాలయం పై జరిగిన దాడిని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ప్రధాని తన ట్వీట్ లో "ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలూ అంతే భయంకరమైనవి. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది మరియు చట్ట నియమాన్ని సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నాము." అని రాసుకొచ్చారు.