Modi : అద్దాల మేడల్లో ఉండటం లేదు.. కేజ్రీవాల్‌పై ప్రధాని మోడీ ఫైర్

తాను అద్దాల మేడల్లో ఉండటం లేదని అయినా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇళ్లు నిర్మించానని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2025-01-03 10:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తాను అద్దాల మేడల్లో ఉండటం లేదని అయినా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇళ్లు నిర్మించానని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అశోక్ విహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ శుక్రవారం ప్రధాని మాట్లాడారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం నివాసంలో అత్యున్నత ప్రమాణాలతో రినెవేషన్ చేయాడాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. రాజధానిలోని నిర్మాణ రంగంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ‘ఆప్ లిక్కర్ స్కామ్, స్కూల్ స్కామ్, పొల్యూషన్ స్కామ్‌లకు పాల్పడింది. ‘ఆప్‌‌’దా(విపత్తు)పై ఢిల్లీ ప్రజలు ఇప్పటికే యుద్ధం ప్రకటించారు. ‘ఆప్‌దా కో నహీ సహేంగే, బదల్ కర్ రహేంగే’ అని ఢిల్లీ ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు. 2025 దేశరాజధానిలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోంది. కొత్త రాజకీయాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. మోడీ సొంతిళ్లు కట్టుకోడని దేశ ప్రజలందరికీ తెలుసు. అయినా పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించాను. నేను తలుచుకుంటే అద్దాల మేడ నిర్మించొచ్చు. మురికి వాడల్లో నివసించే వారికి సైతం పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఇదే విషయాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్లు వెళ్లి స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న వారికి చెప్పాలి.’ మోడీ అన్నారు. కాగా, కేజ్రీవాల్ రూ.45కోట్లతో సీఎం నివాసానికి రెనొవేషన్ చేయిస్తు్న్నారు. ఇందులో రూ.6కోట్లు కేవలం ఫ్లోరింగ్, రూ.కోటి కర్టన్స్(పరదాలకు) ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.  

Tags:    

Similar News