President Murmu : 10 మంది అదనపు జడ్జీలకు పూర్తిస్థాయి జడ్జీలుగా పదోన్నతి

దిశ, నేషనల్ బ్యూరో : బాంబే హైకోర్టుకు చెందిన ఏడుగురు అడిషనల్ జడ్జీలు, ఢిల్లీ హైకోర్టుకు చెందిన ముగ్గురు అడిషనల్ జడ్జీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూర్తిస్థాయి(పర్మినెంట్) జడ్జీలుగా నియమించారు.

Update: 2024-07-19 14:50 GMT
President Murmu : 10 మంది అదనపు జడ్జీలకు పూర్తిస్థాయి జడ్జీలుగా పదోన్నతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : బాంబే హైకోర్టుకు చెందిన ఏడుగురు అడిషనల్ జడ్జీలు, ఢిల్లీ హైకోర్టుకు చెందిన ముగ్గురు అడిషనల్ జడ్జీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూర్తిస్థాయి(పర్మినెంట్) జడ్జీలుగా నియమించారు. బాంబే హైకోర్టుకు చెందిన ఇద్దరు అడిషనల్ జడ్జీల పదవీ కాలాన్ని రీఅపాయింట్మెంట్ ద్వారా మరో ఏడాది పాటు పొడిగించారు.

బాంబే హైకోర్టులో పర్మినెంట్ జడ్జీలుగా నియమితులైన వారిలో యంశివ్ రాజ్ గోపీచంద్ ఖోబ్రాగడే, మహేంద్ర వాధుమాల్ చంద్వానీ, అభయ్ సోపన్ రావ్ వాఘ్వాసే, రవీంద్ర మధుసూదన్ జోషి, సంతోష్ గోవింద్ రావ్ చపల్‌గోన్కర్, మిలింద్ మనోహర్ సథాయే, నీలా కేదార్ గోఖల్క్ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో పర్మినెంట్ జడ్జీలుగా నియమితులైన వారిలో గిరీశ్ కథ్‌పాలియా, మనోజ్ జైన్, ధర్మేశ్ శర్మ ఉన్నారు. ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు పొందిన బాంబే హైకోర్టు ఇద్దరు అదనపు జడ్జీలలో సంజయ్ ఆనంద్ రావు దేశ్ ముఖ్, వృశాలి విజయ్ జోషి ఉన్నారు.

Tags:    

Similar News