Manoj BharathiRaja : ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా(Director BharathiRaja) ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా(Director BharathiRaja) ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా(Manoj BharathiRaja) కాసేపటి క్రితం మరణించారు(Passed Away). సివియర్ కార్డియాక్ అరెస్ట్ తో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ మరణించినట్లు తమిళ సినీ వర్గాలు తెలిపాయి. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలువుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా మనోజ్ "తాజ్ మహల్"(Tajmahal), "సముద్రం" (2001), "కడల్ పూక్కల్" (2001), "అన్నకోడి" (2013) వంటి చిత్రాల్లో నటించాడు మరియు ఇటీవల "మార్గళి తింగళ్" (2023) చిత్రానికి దర్శకుడిగా కూడా పనిచేశాడు, ఇందులో భారతీరాజా కూడా నటించారు. మనోజ్ మరణ వార్త తెలియగానే భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.