ఆ లోక్‌సభ స్థానంలోని 11 బూత్‌లలో పోలింగ్ రద్దు
దిశ, నేషనల్ బ్యూరో : ఇన్నర్ మణిపూర్‌లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో శుక్రవారం రోజు తొలి విడత పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఇన్నర్ మణిపూర్‌లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో శుక్రవారం రోజు తొలి విడత పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. అల్లరి మూకలు హింసకు తెగబడి విధ్వంసానికి పాల్పడిన 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఆయా స్థానాల్లో తిరిగి ఏప్రిల్ 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఈవిషయాన్ని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రీపోలింగ్ జరగనున్న 11 ఓటింగ్ కేంద్రాలు ఖురై, థోంగ్జు, ఉరిపోక్, కొంతౌజామ్, క్షేత్రీగావ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నాయన్నారు. అల్లరి మూకలు పోలింగ్ కేంద్రాలలో క్రియేట్ చేసిన అలజడి వ్యవహారంలో శుక్రవారం రాత్రే మణిపూర్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాల్పుల్లో ఒక వ్యక్తికి గాయమైందన్నారు. ఇంఫాల్‌లోని ఖైడెం మఖా వద్దనున్న పోలింగ్ స్టేషన్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 61 దొంగ ఓట్లు వేశారని మణిపూర్ ఎన్నికల అధికారులు చెప్పారు.