డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై పోలీసుల చార్జిషీట్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. IPC సెక్షన్లు 354 (మహిళ రెజ్లర్‌ను కించపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం చేయడం), 354A (లైంగిక వ్యాఖ్యలు చేయడం), 354D (వెంబడించడం) కింద నేరాలను ఛార్జిషీట్లో పేర్కొన్నారు. అలాగే డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పేరును కూడా చార్జిషీట్లో చేర్చారు.