ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించడం సాధారణ ఘనత కాదు..Narendra Modi
ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడం సాధారణ ఘనత కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ అమృత్‌కాల్‌లో మరింత కష్టపడి మరింత పెద్ద లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసాన్ని ఈ ఘనత మాకు కల్పించిందని ప్రధాని తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడం సాధారణ ఘనత కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ అమృత్‌కాల్‌లో మరింత కష్టపడి మరింత పెద్ద లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసాన్ని ఈ ఘనత మాకు కల్పించిందని ప్రధాని తెలిపారు. గురువారం ఆయన గుజరాత్‌లోని పలు కేంద్ర పథకాల లబ్దిదారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. జీడీపీ విలువ పెరగడం, యూకేను అధిగమించడం దేశ నిరంతర వృద్ధికి ఉదాహరణలని అన్నారు. ఇదే తరహా ఉత్సాహాన్ని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో భారత్ చేసిన ప్రయత్నాలను ప్రపంచమంతా ప్రశంసించిందని చెప్పారు.
గుజరాత్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేరువయ్యాయని తెలిపారు. 97శాతం గ్రామీణ జనాభాకు నల్లా నీరు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. వన్ నేషన్-వన్ రేషన్‌తో వలస కూలీలకు ప్రయోజనం పొందుతారని అన్నారు. గత 2 దశాబ్దాలలో 11 నుంచి 31కి మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం సన్నకారు రైతులకు సహాకారంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతుల పేరుతో ప్రకటనలు చేసే అమలు చేయలేదని విమర్శించారు. గత ఎనిమిదేళ్లో దేశవ్యాప్తంగా 3 కోట్ల గృహాలు నిర్మించగా, ఒక్క గుజరాత్‌లోనే 10 లక్షల ఇళ్లులు నిర్మించామని వెల్లడించారు. ఆప్, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా మోడీ గుజరాత్ ప్రజలతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read: మోడీని ఆ విధంగా ఢీ కొడతాం.. CM Mamata Banerjee కీలక వ్యాఖ్యలు