PM Modi: పద్మ అవార్డుల కోసం పబ్లిక్ నుంచి మరిన్ని నామినేషన్లు రావాలి: ప్రధాని మోడీ

స్పూర్తిదాయకమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు

Update: 2024-09-09 17:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డుల కోసం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పూర్తిదాయకమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. సెప్టెంబర్ 15తో పద్మ అవార్డుల నామినేషన్లకు గడువు ముగుస్తుంది. దీనికి సంబంధించి సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రధాని.. 'గడిచిన దశాబ్ద కాలంలో ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉన్న హీరోలను పద్మ అవార్డులతో సత్కరించాం. అవార్డు గ్రహీతల జీవిత ప్రయాణాలు మరెందరినో ఉత్సాహపరించింది. వారికున్న మనోఃస్థైర్యాన్ని, పట్టుదలను వారు చేసే పనిలో చూశామని ' ట్వీట్ చేశారు. పద్మ అవార్డులను అందజేసే సంప్రదాయాన్ని మరింత పారదర్శకంగా, మరింతమందిని భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ నామినేషన్లు పెరిగేందుకు చొరవ తీసుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. అందుకోసం ప్రజల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తోందన్నారు.  

Tags:    

Similar News