Pm modi: ‘క్రియేట్ ఇన్ ఇండియా’ చాలెంజ్‌లో పాల్గొనండి.. ప్రధాని మోడీ పిలుపు

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘క్రియేట్ ఇన్ ఇండియా’ చాలెంజ్‌లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Update: 2024-09-29 15:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘క్రియేట్ ఇన్ ఇండియా’ చాలెంజ్‌లో పాల్గొనాలని దేశంలోని క్రియేటర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన 114వ మన్ కీ బాత్ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల స్వరూపాలు మారుతున్నాయని, కొత్త కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. గేమింగ్, యానిమేషన్, రీల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ పోస్టర్ మేకింగ్ వంటివి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిలో ఏ రంగంలో యువత రాణించినా వారికి మంచి ఫ్లాట్ ఫామ్ దొరికే అవకాశం ఉందన్నారు.

భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా అనే థీమ్‌తో 25 సవాళ్లను ప్రారంభించిందని గుర్తు చేశారు. దేశంలోని క్రియేటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సృజనాత్మకతను వెలికి తీయాలని కోరారు. ఇందులో పాల్గొనడానికి wavesindia.orgలో లాగిన్ అవ్వాలని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్‌కు ప్రాధాన్యతనిస్తూ పండుగల సమయంలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. చేతి వృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. కాగా, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్‌ను ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించారు. 


Similar News