PM Modi : మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ మోడీ.. 69 శాతం జనామోదంతో టాప్ ప్లేస్

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి అరుదైన ఘనతను సాధించారు.

Update: 2024-08-03 18:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి అరుదైన ఘనతను సాధించారు.ప్రపంచ నాయకుల ప్రధాన నిర్ణయాలను ట్రాక్ చేసే గ్లోబల్ డెసిషన్ ఇంటెలీజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తాజాగా ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. జూలై 8నుంచి 14 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు. దీని ప్రకారం.. భారత ప్రధాని మోడీకి ప్రపంచదేశాల్లో అత్యధికంగా 69 శాతం జనామోదం ఉందని తేలింది. రెండో స్థానంలో మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఉన్నారు. ఈయనకు ప్రపంచదేశాల ప్రజల దృష్టిలో 63 శాతం మేరకు ఆమోదం ఉందని నివేదిక వెల్లడించింది.

ఈ లిస్టులో మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (60 శాతం), నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్ వియోలా అమ్హెర్డ్ (52 శాతం), ఐదో స్థానంలో ఐర్లాండ్‌ ప్రధాని సైమన్ హారిస్ (47 శాతం), ఆరో స్థానంలో బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ (45 శాతం) ఉన్నారు. ఏడో స్థానంలో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (45 శాతం) , ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (42 శాతం), స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ (40 శాతం), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (40 శాతం) ఉన్నారు. 25 మంది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల జాబితాలో చివరి స్థానంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉన్నారు. ఈయనకు ప్రపంచ దేశాల్లో ప్రజామోదం కేవలం 16 శాతమే ఉందని సర్వేలో వెల్లడైంది.

Tags:    

Similar News