Priyanka Gandhi: సోషల్ మీడియాలో ప్రియాంకా గాంధీ ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎమోషనల్ పోస్టు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ తనకు కొత్తే కానీ.. పోరాటం కొత్త కాదని పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎమోషనల్ పోస్టు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ తనకు కొత్తే కానీ.. పోరాటం కొత్త కాదని పేర్కొన్నారు. వయనాడ్(Wayanad Parliament) ప్రజల ధైర్య సాహసాలే తనలో స్ఫూర్తి నింపాయని అన్నారు. వయనాడ్(Wayanad) ప్రజల తరపున పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు. కాగా, గత పార్లమెంట్(Parliament) ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా రాహుల్ గాంధీ గెలుపొందారు. దీంతో వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంకా గాంధీని నిలబెట్టింది. మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రియాంకను ఐదు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్(Congress) ధీమా వ్యక్తం చేసింది. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక నవంబర్ 13న జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.