PM Modi : బైడెన్‌కు ప్రధాని మోడీ ఫోన్ కాల్.. ఆ రెండు అంశాలపైనే చర్చ

దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.

Update: 2024-08-26 18:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఈసందర్భంగా బంగ్లాదేశ్, ఉక్రెయిన్‌ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లొచ్చారు. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన ప్రధాన అంశాల గురించి బైడెన్‌కు మోడీ వివరించారు.

ఉక్రెయిన్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొనాలనేదే తమ ఏకైక ఆకాంక్ష అని, ఇందుకోసం ఎలాంటి సాయమైనా చేస్తామని భారత ప్రధాని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం గురించి బైడెన్, మోడీ చర్చించారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైనా ఇరువురు మాట్లాడుకున్నారు. క్వాడ్ కూటమి సహా అన్ని వేదికల్లోనూ ఇరుదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.


Similar News