మోడీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు: మల్లికార్జున్ ఖర్గే

పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పలేదని ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

Update: 2023-02-10 16:51 GMT

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పలేదని ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఉభయ సభల్లోనూ కేవలం సాధారణ ఉపన్యాసం మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారని అన్నారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ గ్రూప్ వ్యవహారం వంటి ముఖ్యమైన అంశాలు ప్రధాని ప్రసంగంలో లేవని తెలిపారు. రూపాయి విలువ నిరంతరం పడిపోతున్న కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా 71000 ప్రైమరీ పాఠశాలలు మూతబడుతున్నాయని, ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నాయని వీటిపై కూడా మోడీ స్పందించకపోవడం సరికాదన్నారు.

Tags:    

Similar News