నరేంద్ర మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'

ఈజిప్టు ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ ను ప్రదానం చేసింది.

Update: 2023-06-25 11:30 GMT

కైరో : ఈజిప్టు ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ ను ప్రదానం చేసింది. ఇరుదేశాల నేతల ద్వైపాక్షిక సమావేశానికి ముందు ఈ ప్రదానోత్సవం జరిగింది. ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ పురస్కారంతో ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసి సత్కరించారు. ఈ అవార్డును తనకు అందించినందుకు ప్రధాని కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో కలిసి కైరో సిటీలోని అల్-హకీమ్ మసీదును ఆయన సందర్శించారు. గుజరాత్, మహారాష్ట్రలలో పెద్ద సంఖ్యలో ఉండే దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహకారంతో ఈ మసీదును పునరుద్ధరించారు.

బోహ్రా కమ్యూనిటీ ఆహ్వానం మేరకు మోడీ ఈ మసీదు సందర్శనకు వెళ్లారు. అంతకుముందు ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ షాకీ ఇబ్రహెం అబ్దేల్ కరీం అల్లామా, దేశంలోని భారతీయ ప్రవాసులను మోడీ కలిశారు. ఈజిప్ట్, పాలస్తీనా తరఫున మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి అమరులైన దాదాపు 4,000 మంది భారతీయ సైనికుల స్మారకార్థం ఉండే హెలియోపోలిస్ వార్ శ్మశానవాటికను సందర్శించారు.


Similar News