మోడీ, ఈడీ, దీదీలపై కాంగ్రెస్ ఫైర్.. సంచలన వ్యాఖ్యలివీ
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ‘ఇండియా’లోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ‘ఇండియా’లోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ‘‘మోడీకి దీదీకి మధ్య బలమైన అనుబంధం ఉంది. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై బెంగాల్‌లో భౌతిక దాడులు జరిగినా స్పందించడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ సందేశ్‌ఖలీ ప్రాంతంలో ఈడీ ఆఫీసర్లపై టీఎంసీ గూండాలు చేసిన దాడిపై మమతా బెనర్జీ ఎందుకు స్పందించడం లేదో అందరికీ తెలుసు.. ఆమె మద్దతు లేకుండా ఈడీ అధికారులపై ఆ రకమైన దాడి జరిగేదే కాదు’’ అని అధిర్ రంజన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌లో కాకాబాబు, ఖోకాబాబు, షాజహాన్, నూర్జహాన్ లాంటి గూండాలకు కొదవే లేదన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు ధైర్యముంటే కనీసం బెంగాల్‌లో శాంతిభద్రతలు గాడితప్పిన ప్రాంతాల్లోనైనా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. హింసతో అట్టుడికిన మణిపూర్‌లోనే ఏమీ చేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వం.. బెంగాల్‌లో ఏదైనా చేస్తుందని ఆశించడం కూడా సరికాదని ఎద్దేవా చేశారు.