Navya Haridas: ప్రియాంక రోడ్ షో పై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ విమర్శలు
వయనాడ్ లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నిర్వహించిన రోడ్ షో పై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ విమర్శలు గుపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నిర్వహించిన రోడ్ షో పై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ విమర్శలు గుపించారు. టూరిస్ట్ ప్రదేశానికి తీసుకెళ్తామని ప్రియాంక సభకు జనాల్ని తరలించారని ఆరోపించారు. ‘ప్రియాంక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. నేను కార్పొరేషన్ కౌన్సిలర్ గా ప్రజల కోసం ఏళ్లతరబడి పనిచేశాను. నాకు కేవలం ఆ అనుభవమే ఉంది. ఒక అభ్యర్థి ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. నాకు కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్లతరబడి పనిచేసిన అనుభవం ఉంది. కుటుంబ ఆధిపత్యమే ఒక అభ్యర్థి గొప్పతనం అయితే.. అది ప్రియాంకకే చెందుతుంది. బీజేపీకి అలాంటి ప్రమాణాలు లేవు. ఆమె రావడం, రోడ్ షోలు నిర్వహించడం వంటివి సంవత్సరానికి వచ్చిపోయే ఫెస్టివల్ సీజన్ లాంటివి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
వయనాడ్ నుంచి బరిలో..
ఇక, వయనాడ్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బరిలో నిలిచారు. అయితే, ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్‌గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో, ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి నవ్యా హరిదాస్, కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలో ఉండగా.. ఎల్‌డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 23 రానున్నాయి.