Parliament : ఈసారి పార్లమెంటు ఎదుటకు 5 కొత్త బిల్లులు.. 13 పెండింగ్ బిల్లులు
దిశ, నేషనల్ బ్యూరో : ఈనెల 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఈనెల 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో(Parliament Winter Session) కీలక బిల్లులను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం మొత్తం 18 బిల్లులను ప్రభుత్వం లిస్ట్ చేయించింది. వీటిలో వివాదాస్పద ‘వక్ఫ్ సవరణ బిల్లు’ కూడా ఉంది. ఈసారి పార్లమెంటు సెషన్ జరిగే మొదటి వారంలో చివరి రోజున వక్ఫ్ బిల్లును చర్చకు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలు, సూచనలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సేకరించింది. వాటితో రూపొందించిన సమగ్ర నివేదికను పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించింది. దీనిపై చర్చించి ఆమోదించాలని మోడీ సర్కారు(Modi govt) యోచిస్తోంది.
ఈసారి ఐదు కొత్త ముసాయిదా బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ‘రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ’ పేరుతో దేశంలో కోఆపరేటివ్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మరో నాలుగు కొత్త బిల్లులలో.. పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు ఉన్నాయి. పెండింగ్ బిల్లుల జాబితాలో విప్తతు నిర్వహణ సవరణ బిల్లు, రైల్వే సవరణ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిలు, చమురు క్షేత్రాల నిబంధనల సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు ఉన్నాయి. మొత్తం 13 పెండింగ్ బిల్లులను ఈసారి కేంద్రం లిస్ట్ చేయించింది. డిసెంబరు 20న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.