మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నట్టు తేలితే తల్లిదండ్రులకు శిక్ష, జరిమానా: నోయిడా పోలీసులు

మైనర్లు ద్విచక్ర వాహనాలు, కార్లను నడిపితే వారి తల్లిదండ్రులకు శిక్ష, జరిమానా తప్పదని పోలీస్ కమిషనరేట్ స్పష్టం చేసింది

Update: 2024-07-10 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గతకొంతంగా దేశంలో పలుచోట్ల మైనర్లు చేస్తున్న యాక్సిడెంట్‌ల పట్ల పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ అంశంపై నోయిడా పోలీసు అధికారులు మరో ముందడుగు వేసి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు ఎవరైనా ద్విచక్ర వాహనాలు, కార్లను నడిపితే వారి తల్లిదండ్రులకు శిక్ష, జరిమానా తప్పదని గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ స్పష్టం చేసింది. రూ. 25,000 వరకు జరిమానా, మైనర్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై చట్టపరమైన చర్యలు, ఏడాది పాటు రిజిస్ట్రేషన్ రద్దు, నిబంధనలు ఉల్లంఘించినందుకు 25 ఏళ్ల వరకు లైసెన్స్ ఉండదని పోలీసులు హెచ్చరించారు. నోయిడా, గ్రేటర్ నోయిడా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మైనర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు టూ-వీలర్, కార్లు నడిపేందుకు అనుమతించొద్దని అధికారిక ప్రకటనలో పోలీసులు స్పష్టం చేశారు. 


Similar News