Vijay Thalapathy Party: నేడే విజయ్ తలపతి తొలి పొలిటికల్ సభ.. తాగి వెళ్లారో..!
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy Party) ఇప్పుడు పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy Party) ఇప్పుడు పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవలే తమిళగ వెట్రి కళగం (Tamila Vetri Kalagam) అనే పార్టీని స్థాపించిన ఆయన ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక తాజాగా ఈ రోజు (ఆదివారం) మొట్టమొదటిసారి పార్టీకి సంబంధించి తొలి రాజకీయ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తమిళనాడు (Tamilanadu)లోని విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 50 వేల మందికి సీటింగ్, లక్ష మందికి పైగా సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar), పెరియార్‌లతో పాటు తమిళనాడు రాజకీయ ఉద్దండుల కటౌట్‌ల మధ్య విజయ్ కటౌట్‌తో సభా ప్రాంగణాన్ని అలంకరించారు.
ఇక ఈ సభకు హాజరయ్యే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు విజయ్ పార్టీ నుంచి కీలక సూచనలు కూడా వచ్చాయి. గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, బాలబాలికలు ఈ సదస్సులో పాల్గొనవద్దని, ఆన్‌లైన్‌లో తమ సభను చూడాలని పార్టీ అధినాయకత్వం కోరింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారు వెహికల్ కెపాసిటీ ప్రకారమే ప్రజల్ని తీసుకురావాలి. ద్విచక్రవాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలను సదస్సుకు వెళ్లే దారిలో వైన్ షాపుల దగ్గర పార్కింగ్ చేయకూడదు. మరీ ముఖ్యంగా మందు తాగి రావడానికి ప్రయత్నం కూడా చేయవద్దు. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో సభా ప్రాంగణంలోకి అనుమతి లభించదు.
ఇదిలా ఉంటే విజయ్ రాజకీయ రంగప్రవేశం (Political Entry)పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. అయితే విజయ్ మాత్రం తాను ఇకపై పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని, సినిమాలు చేయనని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే తన చివరి సినిమాగా 69ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పార్టీ తరపున తలపతి విజయ్ పోటీ చేస్తున్నారు. కాగా.. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం (Indipendence DaY) విడుదలైన విజయ్ పార్టీ జెండాపై తొలినాటి నుంచి వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.