Pak origin man: కెనడాలో పాక్ సంతతి వ్యక్తిపై హత్యాయత్నం.. నిజ్జర్ నిరసనల్లో పాల్గొన్న రహత్ రావు

కెనడాలో పాకిస్థాన్ సంతతి వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పాక్‌కు చెందిన రహత్ రావు కెనడాలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు.

Update: 2024-08-04 11:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో పాకిస్థాన్ సంతతి వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పాక్‌కు చెందిన రహత్ రావు కెనడాలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతి తర్వాత జరిగిన నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో నిర్వహించిన ఆందోళనలో రహత్ రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై హత్యాయత్నం జరగం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. రహత్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్ కాదని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News