MUDA LAND SCAM: కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) భూ కుంభకోణం కేసుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

Update: 2024-08-17 09:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) భూ కుంభకోణం కేసుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. రాజ్‌భవన్‌ను బీజేపీ ఒక సాధనంగా వాడుకుంటుందని.. పదవి దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, సిద్ధరామయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు గవర్నర్‌కు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్నాయని బీజేపీ ఎదురుదాడి చేసింది.

నిరసనలకు సిద్ధమైన కాంగ్రెస్

అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను వెనుకేసుకు వచ్చింది, ఈ సమస్యపై పార్టీ కలిసి పోరాడుతుందని చెప్పారు. సిద్ధరామయ్యపై విచారణకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యాప్తంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్థానిక కాంగ్రెస్ యూనిట్ ని కోరారు. దీనిపై న్యాయపరంగా పోరాడాలని సిద్ధరామయ్య నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వమేనని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. "ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు రాజ్‌భవన్‌ను బీజీపీ ఒక సాధనంగా దుర్వినియోగం చేస్తోంది. రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు గవర్నర్ రాజ్యాంగ సంక్షోభాన్ని రేకెత్తిస్తున్నారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వమే ఉంది. కానీ,మ దీనిపై పోరాడుతాం. రాజ్యాంగం మావేపై ఉంది’’ అని ఖర్గే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో సిద్ధరామయ్యపై రాజకీయ పగ వల్లే ఈ పరిణామం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ ఆరోపించారు. గతసారి ప్రభుత్వాలను అస్థిరపరిచిన బీజేపీకి ప్రజలే బుద్ధిచెప్పారని అన్నారు. అయినప్పటికీ బీజేపీ ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు కన్పించట్లేదన్నారు.

బీజేపీ ఏమందంటే?

'కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర స్పందించారు. బంధుప్రీతి, అవినీతిపై సిద్ధరామయ్యకు ఎవరూ పోటీ లేరని నిరూపించారని విజయేంద్ర అన్నారు. దాదాపు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు కుంభకోరణం జరిగిందని ఆరోపించారు. సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన కేసరు గ్రామంలోని 3.16 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. ఈ భూమిని లేఅవుట్ అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పార్వతికి 2022లో విజయనగరంలో 14 ప్రీమియం భూమును పరిహారం కింద కేటాయించారు. ముడా స్వాధీనం చేసుకున్న స్థలంతో పోలిస్తే ఆమెకు కేటాయించిన భూములు ఎక్కువగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ కేసుని విచారించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ దేశాయ్ నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


Similar News