OpenAI: ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఓపెన్‌ ఏఐ(OpenAI) మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి చెందాడు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు.

Update: 2024-12-14 04:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓపెన్‌ ఏఐ(OpenAI) మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి చెందాడు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కార్యకలాపాలు, అభ్యాసాల గురించి సుచిర్ బాలజీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఓపెన్‌ఏఐ మాజీ రీసెర్చర్ సుచిర్ బాలాజీ ఎంతకీ స్పందించకపోవడంతో.. ఆయన సన్నిహితులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్ మెంటులో సుచిర్ డెడ్ బాడీని గుర్తించారు. అయితే, నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో సుచిర్ డెడ్ బాడీ లభ్యమైంది. కానీ, ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇది ఆత్మహత్య అని పోలీసులు భావిస్తున్నారు.

ఓపెన్ ఏఐకి రాజీనామా

ఆగస్ట్‌లో ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీకి సుచిర్ బాలాజీ రాజీనామా చేశారు. ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో రీసెర్చ్ లో ఆయన వెల్లడించారు. ఆ కంపెనీ పలు కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఓపెన్ ఏఐపై ఆరోపణలు చేసిన సుచిర్ మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. కాగా.. సుచిర్ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.

Tags:    

Similar News