Kiren Rijiju: మన మాటలు, చేతలు దేశాన్ని తక్కువ చేసి చూపేలా ఉండొద్దు.. కిరణ్ రిజిజు
భారత రాజ్యాంగంపై లోక్ పార్లమెంటులో(Parliament Winter Session) రెండోరోజు ప్రత్యేక చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) లోక్ సభలో( Lok Sabha) చర్చను ప్రారంభించారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగంపై లోక్ పార్లమెంటులో(Parliament Winter Session) రెండోరోజు ప్రత్యేక చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) లోక్ సభలో( Lok Sabha) చర్చను ప్రారంభించారు. ఈసందర్భంగా భారత్‌లోని మైనారిటీలకు న్యాయపరమైన రక్షణ లభిస్తోందన్నారు. ‘మన మాటలు, చేతలు ప్రపంచం ముందు భారత్‌ను తక్కువ చేసి చూపేలా ఉండకూడదు. మన దేశంలో మైనారిటీలకు న్యాయపరమైన రక్షణతో పాటు వారి నమ్మకాలను కాపాడే చట్టాలున్నాయని, కాంగ్రెస్‌తో పాటు అనేక ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం కృషి చేశాయి’ అని తెలిపారు. దేశంలోని అందరికి సార్వత్రిక ఓటింగ్ హక్కులు ఉన్నాయన్నారు. కానీ, మైనారిటీలకు హక్కులు లేవని కొందరు చెబుతారని విపక్షాలకు రిజిజు చురకలు అంటించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి..
ప్రధానిగా మోడీ బాధ్యలు చేపట్టినప్పట్నుంచి రాజ్యాంగ స్ఫూర్తిని అసుసరించే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని రిజిజు చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులలో భారతీయులు ఒకరని రిజిజు అన్నారు. ఇంత జరిగినా భారత్ ఎందుకు అభివృద్ధి చెందిన దేశం కాలేదని.. దానికోసం ప్రణాళిక అవసరం ఆయన ప్రశ్నించారు. వచ్చే 23 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. 1947 నుంచి 2014 మధ్య ఈశాన్య ప్రాంతంలో తొమ్మిది విమానాశ్రయాలు ఉండగా.. గత పదేళ్లలో వీటి సంఖ్య 17కి పెరిగింది. ఇక, పార్లమెంటులో ప్రతిపక్షాలు కలిగిస్తున్న అడ్డంకులపై విరుచుకుపడ్డారు. "కొన్నిసార్లు సభను అడ్డుకోవడం ఫర్వాలేదు, కానీ పదేపదే ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని" అన్నారు. తాను సాదాసీదా మనిషినని.. తన మనసులోని మాటను చెబుతానని అన్నారు. శాంతియుతంగా అందరూ కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి రిజిజు పిలుపునిచ్చారు.