One Nation-One Election : ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఉపసంహరించుకోవాలి..

వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.

Update: 2024-12-12 16:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే కాంగ్రెస్ జమిలిపై నిర్ణయం స్పష్టం చేసింది. మొదటి నుంచి ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తూ వస్తున్నాం. బలమైన ప్రజాస్వామ్యం కోసం, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, హైపవర్ కమిటీ రద్దు చేయాలి’ అని అన్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రం చర్యను తప్పుబట్టారు. ‘ఇది రాజ్యాంగ విరుద్ధం. అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. భారత ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని అణగదొక్కే ప్రయత్నం. ఢిల్లీ నియంతృత్వానికి బెంగాల్ ఎన్నటికీ తలొగ్గదు.’ అని అన్నారు. ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రాధాన్యతలు గతి తప్పుతున్నాయన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అవసరం లేదని.. ‘వన్ నేషన్- వన్ ఎడ్యుకేషన్’, ‘వన్ నేషన్-వన్ హెల్త్ కేర్ సిస్టమ్’ కావాలన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రం చర్యలపై స్పందిస్తూ.. ‘బిల్లు ఆమోదం తీవ్రమైన చర్య. ప్రాంతీయ పార్టీల గొంతును లేకుండా చేసే కుట్ర. ఫెడరలిజాన్ని కేంద్రం నాశనం చేస్తోంది. పాలనకు విఘాతం కలిగిస్తోంది.’ అన్నారు.

Tags:    

Similar News