అవినీతి పరుల నియంత్రణలో ఒడిశా : ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు

ఒడిశాలో తొలిసారిగా బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ దీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించారు.

Update: 2024-05-20 06:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో తొలిసారిగా బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ దీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా ధెంకనల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. ఒడిశాలో నీరు, అడవి భూమి ఉన్నప్పటికీ అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 25ఏళ్లుగా బిజూ జనతా దళ్(బీజేడీ) ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. బీజేడీ హయాంలో పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం కూడా సురక్షితం లేదని ఆరోపించారు. ఒడిశా ప్రభుత్వం పూర్తిగా అవినీతిపరుల నియంత్రణలో ఉందని మండిపడ్డారు.

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడ్డాక అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. గత పదేళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశ ప్రజలంతా చూశారన్నారు. 21వ శతాబ్దపు ఒడిశా అభివృద్ధిలో వేగం కావాలని, అది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బహిరంగ సభకు ముందు మోడీ ఒడిశాలోని పూరీలో రోడ్ షో నిర్వహించారు. పూరీలోని జగన్నాథ ఆలయంలో పూజలు చేశారు. పూరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశాలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 

Tags:    

Similar News