North Korea army: యుద్ధంలో శత్రువులను పూర్తిగా అంతమొందిస్తాం..ఉత్తర కొరియా సైనికాధికారుల ప్రతిజ్ఞ!

అమెరికా, దక్షిణ కొరియాలతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తర కొరియా సైనికాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశిస్తే తమ శత్రువులను పూర్తిగా నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్టు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ తెలిపింది.

Update: 2024-07-28 08:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, దక్షిణ కొరియాలతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తర కొరియా సైనికాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశిస్తే తమ శత్రువులను పూర్తిగా నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్టు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ తెలిపింది. 71వ ఉత్తర కొరియా యుద్ధ విరమణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో కిమ్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఆర్మీ కల్నల్ రి అన్ ర్యాంగ్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ యు క్యోంగ్ సాంగ్‌ సహా సీనియర్ సైనిక అధికారులు యూఎస్, సౌత్ కొరియా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పేర్కొంది.

ఈ రెండు దేశాలు అణు యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వారి ప్రయత్నాలను తప్పి కొట్టాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. కిమ్ ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా తమ శత్రువులపై దాడి చేయడానికి తమ పోరాట సంసిద్ధతను పెంచుకుంటామని వారు స్పష్టం చేసినట్టు వెల్లడించింది. కాగా, యుద్ధాలకు సిద్ధంగా ఉండాలని గతంలో కిమ్ తమ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైనికాధికారుల తాజా ప్రతిజ్ఞ ప్రాధాన్యత సంతరించుకుంది. 1953 జూలై 27 న ఉత్తర కొరియా అమెరికా, చైనాతో యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది మూడేళ్ల కొరియా యుద్ధానికి ముగింపు పలికింది. కాబట్టి ఈ రోజును ఉత్తర కొరియా విక్టరీ డేగా జరుపుకుంటున్నది.

Tags:    

Similar News