పొత్తు లేదు థర్డ్ ప్రంట్ లేదు: బీఎస్పీ చీఫ్ మాయవతి కీలక వ్యాఖ్యలు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి మరోసారి స్పష్టం చేశారు. పూర్తి సన్నద్దతతో ఉన్నామని, ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి మరోసారి స్పష్టం చేశారు. పూర్తి సన్నద్దతతో ఉన్నామని, ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్నికల్లో పొత్తులు, మూడో ఫ్రంట్ ఏర్పాటు పూర్తిగా అబద్ధం. అవన్నీ తప్పుదోవ పట్టించే వార్తలు. మీడియా అటువంటి వార్తలు ప్రచారం చేయొద్దు. వారి విశ్వసనీయతను కాపాడుకోవాలి. ప్రజలు కూడా పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘యూపీలో బీఎస్పీకి ఎంతో బలం ఉంది. అందుకే ప్రత్యర్థి పార్టీలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతి రోజూ తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. ఒంటరిగానే బరిలోకి దిగాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ మారదు’ అని తెలిపారు. 2024 ఎన్నికల్లో సొంతంగా పోరాడతామని పేర్కొన్నారు. కాగా, గతంలోనూ బీఎస్పీ ఇండియా కూటమిలో చేరబోతుందంటూ వార్తలు రాగా వాటిని మాయవతి కొట్టి పారేశారు. ఇప్పటికే యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లు పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొత్తం 80 స్థానాలకు గానూ ఎస్పీ 63, కాంగ్రెస్ 17స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకరించాయి.