చాందీపుర వైరస్‌‌‌తో తొలి మరణం.. ఎక్కడంటే..

దిశ, నేషనల్ బ్యూరో : చాందీపుర వైరస్‌ సోకడం వల్ల తొలిమరణం గుజరాత్‌లో సంభవించింది.

Update: 2024-07-17 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : చాందీపుర వైరస్‌ సోకడం వల్ల తొలిమరణం గుజరాత్‌లో సంభవించింది. నాలుగేళ్ల బాలిక శాంపిల్స్‌లో చాందీపుర వైరస్ ఆనవాళ్లను గుర్తించామని పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) వెల్లడించింది. గుజరాత్‌లో ఇప్పటివరకు చాందీపుర వైరస్‌ అనుమానిత కేసులు 14 నమోదయ్యాయి. అయితే వారిలో ఎనిమిది మంది చికిత్సపొందుతూ చనిపోయారు. వీరిలో బాలిక మృతికి చాందీపుర వైరసే కారణమని ఎన్‌ఐవీ ధ్రువీకరించింది. చనిపోయిన మిగతా ఏడుగురి శాంపిల్స్‌ను కూడా టెస్టింగ్ కోసం ఎన్‌ఐవీకి పంపామని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్‌ తెలిపారు. రాజస్థాన్‌‌లో ఇద్దరికి, మధ్యప్రదేశ్‌‌లో ఒకరికి చాందీపుర వైరస్ సోకగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ సోకిన వారిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.


Similar News