నీట్ యూజీ పేపర్ లీక్ కేసు..మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

నీట్ యూజీ పేపర్ లీక్‌కు సంబంధించిన కేసులో సీబీఐ మంగళవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. వారిని బిహార్‌లోని పాట్నాకు చెందిన వారిగా గుర్తించింది.

Update: 2024-07-09 17:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పేపర్ లీక్‌కు సంబంధించిన కేసులో సీబీఐ మంగళవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. వారిని బిహార్‌లోని పాట్నాకు చెందిన వారిగా గుర్తించింది. నీట్ అభ్యర్థి సన్ని కుమార్‌ను నలందలో, మరో అభ్యర్థి తండ్రి రంజిత్ కుమార్‌ను గయాలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 11కి చేరుకుంది. బిహార్, జార్ఖండ్‌లలో 8 మందిని, గుజరాత్‌లోని లాతూర్, గోద్రాలో ఒక్కొక్కరిని, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొదటగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. ఇందులో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసాన్ ఉల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్, జర్నలిస్టు జమాలుద్దీన్ ఉన్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.


Similar News