Neet student: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 15వ ఘటన

రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-09-05 09:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటాలో మరో నీట్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. తను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాకు చెందిన పరశురామ్ (21) అనే విద్యార్థి నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఏడురోజుల క్రితమే కోటా నగరానికి వచ్చారు. అక్కడి ఓ ప్రయివేట్ కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకుని.. జవహర్‌నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం తన నివాసం ఉండే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు స్థానిక పోలీస్ అధికారి గోపాల్ లాల్ బైర్వా తెలిపారు. దీంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల సంఖ్య 15కు చేరుకుంది. కాగా, గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.


Similar News