సచివాలయం పై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్ సచివాలయం భవనం పైనుంచి దూకారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు.

Update: 2024-10-04 09:23 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర సచివాలయ భవనం పైనుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే(NCP MLA), డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్ (narhari jhirwal) కిందకు దూకారు. గిరిజన తెగకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో నిరసన తెలుపుతూ అజిత్ పవార్ వర్గానికి చెందిన ఆయన ఈ పనిచేశారు. గిరిజను తెగకు చెందిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్ తెగ (ST)లో చేర్చడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నరహరి ఝిర్వాల్ సచివాలయ భవనంలోని మూడవ అంతస్తు నుంచి కిందికి దూకినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. కాగా.. భవనానికి ముందుగానే సేఫ్టీ నెట్ ఉండటంతో ఆయనకు ఏమీ జరగలేదు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది నెట్ లో చిక్కుకున్న నరహరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News