బాలాసోర్ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి.. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా

బాలాసోర్ రైలు ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

Update: 2023-06-03 14:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. 250కి పైగా మంది చనిపోయారని అన్నారు. ఒక ట్రైన్ కు యాక్సిడెంట్ జరిగినప్పుడు మిగతా రెండు ట్రైన్లకు ఆపకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ఇక్కడే ఏదో తప్పు జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాలాసోర్ రైలు ప్రమాదంపై రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు 288 మంది చనిపోగా 800కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

ఒడిశా ఘటనపై పాకిస్తాన్ ప్రధాని సహా ప్రపంచ నేతల సంతాపం  

Tags:    

Similar News