US Election Results:వరుసగా 20వ సారి గెలిచిన మహిళగా రికార్డు

అమెరికా ఎన్నికల ఫలితాల్లో(US Election Results) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైనట్లే. కాగా.. సెనెట్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి.

Update: 2024-11-06 09:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికల ఫలితాల్లో(US Election Results) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైనట్లే. కాగా.. సెనెట్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రటిక్‌ అభ్యర్థి నాన్సీ పెలోసీ (Nancy Pelosi) విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 12వ కాంగ్రెషనల్‌ డిస్ర్టిక్ట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఇప్పుడొచ్చిన ఫలితాలతో కాలిఫోర్నియా నుంచి వరుసగా 20 సార్లు గెలిచిన మహిళగా నాన్సీ నిలిచారు. ఇక ఈ ఎన్నికతో ఆమె అమెరికా రాజకీయాల్లో కీలకమైన శక్తిగా నాన్సీ పెలోసీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

అమెరికా రాజకీయాల్లో కీలకమైన శక్తిగా

1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో నాన్సీ పెలోసీ విజయం సాధించారు. ఆ తర్వాత అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి మహిళా స్పీకర్‌గా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా, 2003 నుంచి నాన్సీ పెలోసీ హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. 2007- 2011 వరకు, ఆ తర్వాత 2019- 2023 వరకు హౌస్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. మరోవైపు, అమెరికా కాంగ్రెస్‌ చరిత్రలో డెమొక్రటిక్‌ పార్టీ నుంచి ఎక్కువ కాలం పనిచేసిన నేతగా నాన్సీ పెలోసీ నిలిచారు. మరోవైపు ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు, నాన్సీకి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం సహా ముఖ్యమైన ప్రక్రియల్లో డెమొక్రటిక్‌ పార్టీకి నాయకత్వం వహించారు.


Similar News