Us elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తుల హవా.. ఆరుగురు అభ్యర్థుల విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు సత్తా చాటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు 9 మంది పోటీ చేయగా ఆరుగురు అభ్యర్థులు గెలుపొందారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు (Indian Americans) సత్తా చాటారు. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు 9 మంది ఇండో అమెరికన్లు పోటీ చేయగా అందులో ఆరుగురు అభ్యర్థులు యూఎస్ కాంగ్రెస్ ఎంపీలుగా గెలుపొందారు. వర్జినియా స్థానం నుంచి సుహాస్ సుబ్రమణ్యం (Suhas Subramanyam), కాలిఫోర్నియా నుంచి అమీబెరా (Amee bera), ఇల్లినాయిస్ లో రాజా కృష్ణ మూర్తి (Raja krishna murthy), కాలిఫోర్నియా నుంచి రో ఖన్నా (Ro khanna), వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ (Prameela jayapal), మిచిగాన్ నుంచి శ్రీతానేదార్‌లు (thaanedhaar) విజయం సాధించారు. ఇందులో భారతీయ అమెరికన్ న్యాయవాది అయిన సుహార్ సుబ్రమణ్యం వర్జీనియా, ఈస్ట్ కోస్ట్ నుంచి ఎంపికైన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ క్లాన్సీపై గెలుపొందారు. అంతేగాక ప్రస్తుతం అరిజోనా నుంచి బరిలోకి దిగిన మరో భారత సంతతి వ్యక్తి అమిష్ షా సైతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఆయన కూడా విజయం సాధిస్తే యూఎస్ ప్రతినిధులు సభలో భారతీయ అమెరికన్ల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. త్వరలోనే దీని ఫలితం వెలువడనుంది.
Read More..