Myanmar voilance: మయన్మార్ తిరుగుబాటుదారులతో సంబంధాలు..నిందితుడిపై ఎన్ఐఏ చార్జిషీట్

ఈశాన్య ప్రాంతంలో నెట్‌వర్క్‌ను కలిగి ఉండి, మయన్మార్‌కు చెందిన తిరుగుబాటు గ్రూపులతో సంబంధం ఉన్న కేసులో నిందితుడైన లాల్‌గైహవ్మాపై బుధవారం చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది.

Update: 2024-07-31 14:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య ప్రాంతంలో నెట్‌వర్క్‌ను కలిగి ఉండి, మయన్మార్‌కు చెందిన తిరుగుబాటు గ్రూపులతో సంబంధం ఉన్న కేసులో నిందితుడైన లాల్‌గైహవ్మాపై బుధవారం చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. ‘మయన్మార్ ఆధారిత తిరుగుబాటు గ్రూపులతో లాల్‌గైహవ్మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. వారి సహాయంతో దేశంలోని వివిధ మిలిటెంట్లకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను సరఫరా చేసేవారు. ఇందుకు గాను మయన్మార్‌కు చెందిన అతని సహచరులతో సహా వివిధ మార్గాల ద్వారా భారీగా నిధులను అందుకున్నాడు’ అని పేర్కొంది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఈ వివరాలు వెల్లడయ్యాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు తెలిపింది. నిందితుడు లైసెన్స్ పొందిన ఆయుధ డీలర్లతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని వారి ద్వారానే ఆయుధాలు సప్లై చేసేవాడని తెలిపింది. కాగా, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో మిజోరాంకు చెందిన కొన్ని సంస్థలు నిమగ్నమై ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో లాల్‌గైహవ్మా, ఇతరులపై 2023 డిసెంబర్ 26న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.

Tags:    

Similar News